రైల్వేస్టేషన్లకు ఉగ్రదాడులు!

bomb checking
bomb checking


న్యూఢిల్లీ: దేశంలో దాడులు సృష్టించేందుకు పాకిస్థాన్‌ కుట్రలు పన్నుతుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లు, రైళ్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడుల జరపవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లలో ఉగ్రవాదులు దాడులు జరుపవచ్చని అప్రమత్తంగా ఉండాలని నిఘా పేర్కొన్నాయి. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అన్ని రైల్వే స్టేషన్లకు హెచ్చరికలు జారి చేశారు. దీంతో ఆర్‌పిఎఫ్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రైల్వే స్టేషన్లలో రైళ్లను, అనుమానాస్పద వ్యక్తులను ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అంతేగాక ప్రధాన ఆలయాల వద్ద కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..