గుంటూరులో భారీ పేలుడు..ఇద్దరు మృతి

ఓ మెడికల్ డిస్ట్రిబ్యూషన్ స్టోర్ లో ప్రమాదం

ied-bomb-blast
ied-bomb-blast

గుంటూరు: గుంటూరులోని కొత్తపేటలో భారీ పేలుళ్ల కారణంగా ఇద్దరు మృతి చెందారు. ఓ భవంతిలో ఉన్న లాంగ్ లీవ్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ అనే స్టోర్ లో బుధవారం అర్ధరాత్రి ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో స్టోర్ యజమాని రామారావుతో పాటు మరొకరు మరణించారు. ఏసీ గ్యాస్ నింపుతుండగా ఈ పేలుళ్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు. అయితే, ఈ ప్రమాదం ఏసీ గ్యాస్ ఫిల్లింగ్ కారణంగా జరిగినట్టు కనిపించడంలేదని, సందేహించాల్సిందేనని ఏసీ మెకానిక్ లు అంటున్నారు. క్లూస్ టీమ్ ఘటన స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/