తండ్రి అయిన ఉస్సేన్ బోల్ట్

కూతురు జన్మించడంతో బోల్ట్‌ దంపతుల ఆనందం

Boltt becomes a father
Bolt becomes a father

జమైకాకు చెందిన ఒలింపిక్‌ స్ప్రింట్‌ లెజెండ్‌ ఉసేన్‌ బోల్ట్‌, అతడి భార్య కాసి బెన్నెట్‌ ఆడపిల్లకు జన్మనిచ్చారు.

తొలిసారిగా తండ్రి అయిన బోల్ట్‌ ఆనందంతో తన కుమార్తెకు స్వాగతం పలికాడని మీడియా నివేదికలు తెలిపాయి.

జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్‌ సోషల్‌ మీడియా పోస్టులో బోల్ట్‌కు కుమార్తె జన్మించిందని ధ్రువీకరించారు.

మా స్ప్రింట్‌ లెజెండ్‌ ఉసేన్‌బోల్ట్‌, కాసి బెన్నెట్‌కు వారి కుమార్తె రాక సందర్భంగా అభినందనలు తెలుపుతున్నాను అని హోల్నెస్‌ ట్వీట్‌ చేశారు.

బోల్ట్‌ దంపతులకు కుమార్తె జన్మించిందని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/