మోడి ప్రభుత్వంపై పరోక్షంగా కామెంట్

ముంబయి: శంషాబాద్ వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా కలకలం రేపుతోంది. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఘటనపై సోషల్ మీడియాలో ట్వీట్స్ చేశారు. భారత ప్రధాని నరేంధ్ర మోడిపై పరోక్ష విమర్శలు చేశారు. బేటీ బచావో బేటీ పడావో అనేది కేవలం ఓ క్యాంపెయిన్ మాత్రమే కాకూడదని దానిని ఆచరణలోనూ..పెట్టాలని పరోక్షంగా మోడి ప్రభుత్వానికి కౌంటర్ వేశారు. ఇంకా అమాయకురాలైన వైద్యురాలిపై దారుణ ఘటనకు పాల్పడిన నిందితులు మనుషుల మధ్య తిరుగుతున్న దెయ్యాలంటూ సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక రెడ్డి అనుభవించిన నరకం గురించి తెలుసుకున్నాం కాబట్టి మరో అమాయకురాలు బలి కాకముందే సమాజం అంతా ఐక్కమై ఇలాంటి దెయ్యాలను ఏరిపారేయాలని తెలిపారు. మరే కుటుంబ ఇలాంటి బాధను అనుభవించకూడదని సల్మాన్ ఖాన్ అన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/