బిజెపిలో తీర్ధం పుచ్చుకున్న సన్నీడియోల్‌

sunny deol
sunny deol

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్‌ బిజెపి తీర్ధం పుచ్చుకున్నాడు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో మంగళవారం కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..అటల్‌జీ హయాంలో తన తండ్రి పనిచేసిన విధంగానే తాను కూడా మోది నేతృత్వంలో పనిచేస్తాను అని, పార్టీకి తాను చేయగలిగినంత సేవ చేయాలనుకుంటున్నాను అని అన్నారు. పనితో తన సామర్ధ్యాన్ని నిరూపించుకుంటాను, మాటలతో కాదు అని వ్యాఖ్యానించారు.
గతంలో సన్నీడియోల్‌ను అమృత్‌సర్‌ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపనున్నారని సమాచారం. కానీ తాజా సమాచారం ప్రకారం చండీగఢ్‌ లేదా గురుదాస్‌పూర్‌ నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

తాజా హీరోల ఫోటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/