బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి

సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి

Irrfan Khan (file)
Irrfan Khan (file)

Mumbai: ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్   కన్నుమూశారు. 2018 లో న్యూరోఎండోక్రిన్ ట్యూమర్‌తో బాధపడ్డ ఆయ‌న  లండ‌న్‌లో చికిత్స పొందారు. కోలుకున్న త‌ర్వాత  ఇండియాకి వ‌చ్చారు.

అయితే మంగ‌ళవారం ఇర్ఫాన్ అనారోగ్యానికి గురికావ‌డంతో  ముంబైలోని కోకిలాబెన్ ఆసుప‌త్రికి తర‌లించారు. చికిత్స పొందుతూ ఆయ‌న క‌న్నుమూశారు.

ఇర్ఫాన్ త‌ల్లి  ‌సైదా బేగం ఎప్రిల్ 25 ఉదయం కన్ను మూసింది. లాక్‌డౌన్ కారణంగా కన్నతల్లిని కడసారి చూపులకు నోచుకోలేకపోయాడు. ఇక తన తల్లి అంత్యక్రియలను అతను వీడియో మాధ్యమం ద్వారా వీక్షించి ఎంతో తల్లడిల్లిపోయాడు.

త‌ల్లి చ‌నిపోయి కొద్ది రోజులు కూడా కాక‌ముందే ఇర్ఫాన్ ఇలా ఆక‌స్మాత్తుగా క‌న్నుమూయ‌డంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత అవుతున్నారు. ఆయ‌న మృతితో బాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ దిగ్భ్రాంతి చెందింది. ఇర్ఫాన్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని దేవుడిని ప్రార్ధించారు.

ఇర్ఫాన్ చివ‌రిగా  ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఇర్ఫాన్ స్వస్థలం  జైపూర్..రాజస్థాన్. 1967లో ఆయన జన్మించారు. హిందీ చిత్రాలతో పాటు పలు తెలుగు సినిమాల్లో కూడా ఆయన నటించారు.

మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీలో పొలిటిషియన్ గా తనదైన నటనతో మెప్పించారు. 2011లో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు.

అంతేకాదు పలు  ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/