యాదాద్రీశునికి 30 తులాల బంగారం విరాళం: బోయినపల్లి వినోద్‌

boinapalli-vinod-kumar-presented-30-tula-gold-to-yadadri-temple

యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి విమాన గోపురానికి స్వర్ణ తాపడానికి బంగారం విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆలయ గోపురానికి బంగారంతో తాపడం చేయించడానికి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు తమ వంతుగా బంగారం విరాళంగా ఇస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 30 తులాల బంగారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆలయ ఈవో గీతకు ఆయన సతీమణి బోయినపల్లి మాధవి అందజేశారు.

కాగా, తిరుమల తరహాలో ఆలయ విమాన గోపురానికి బంగారం తాపడం చేయించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీనికోసం 125 కిలోల పుత్తడి అవసరమవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/