50శాతం కుళ్లిన దిశ నిందితుల మృతదేహాలు

వెల్లడించిన గాంధీ సూపరింటెండెంట్‌ శ్రవణ్‌

Disha case victims
Disha case victims

హైదరాబాద్‌: దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయాయని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన హైకోర్టుకు వివరించారు. నిందితుల మృతదేహాలను 2 నుంచి 4 డిగ్రీల వద్ద ఫ్రీజర్‌లో ఉంచామని శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు. అయినప్పటికీ వారి మృతదేహాలు 50 శాతం వరకూ డీకంపోజ్‌ అయ్యాయని చెప్పారు. ఇంకా కొన్నాళ్లు ఇలాగే ఫ్రీజర్‌ మృతదేహాలను ఉంచితే మరో వారంలోగా 100 శాతం కుళ్లిపోయే అవకాశం ఉందని శ్రవణ్‌ కోర్టుకు వివరించారు. ఇతర ఆసుపత్రుల్లో ఎక్కడైనా మృతదేహాలను భద్రపరిచే అవకాశం ఉందా అని హైకోర్టు శ్రవణ్‌ను ప్రశ్నించగా, అది తనుకు తెలియదని శ్రవణ్‌ జవాబిచ్చారు. అంతేకాకుండా డిసెంబర్‌ 9 న మృతదేహాలను గాంధీకి తీసుకువచ్చారని ఆయన కోర్టుకు తెలిపారు. మొదటిసారి నిందితుల మృతదేహాల పోస్టుమార్టం వివరాలను అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు వివరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/