ప్రాణహిత నదిలో ప్రమాదం.. గల్లంతైన ఫారెస్టు ఆఫీసర్లు

Pranhita River
Pranhita River

కొమురంభీం అసిఫాబాద్‌: ప్రాణహిత నదిలోనాటు పడవ బోల్తా పడిన ఘటన అసిఫాబాద్‌ జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని అహేరి నుంచి గూడెంకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ఇద్దరు గల్లంతు కాగా మరో నలుగురు సురక్షితంగా ఉన్నారు. పడవలో ప్రయాణిస్తున్న ఆరుగురు ఫారెస్టు అధికారులు, అయితే గల్లంతు అయిన ఇద్దరు ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గల్లంతైన వారిని శివపల్లి బీట్‌ ఆఫీసర్‌ గురేష్‌, కేతిని బీట్‌ ఆఫీసర్‌ బాలకృష్ణగా గుర్తించారు. మిగిలిన నలుగురు ఆఫీసర్లు సురక్షితంగానే ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/