నాలుగో రోజు గాలింపు చర్యలు

తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో పడవ బోల్తా ఘటనలో గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం నాలుగో రోజు గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయ చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్పీ, నేవీ, పోలీసు, ఎస్పీఎఫ్, అగ్నిమాపక శాఖ, మత్స్యకారులు పాల్గొన్నారు. సహాయ సిబ్బంది యానాం శివారు సావిత్రినగర్, బైరవపాలెం సముద్ర తీరంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన మరో ఐదుగురు విద్యార్థినుల ఆచూకీ లభించక పోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.