జాగ్రత్తల్లో భాగంగా లతా మంగేష్కర్ భవనంకు సీల్

ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు జాగ్రత్తలు

BMC Seals Lata Mangeshkar Building-

Mumbai: దేశంలోని ప్రముఖులు కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో ‘గాన కోకిల’ లతా మంగేష్కర్ ఆరోగ్యం పట్ల ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇప్పటికే లతాజీ ఇంటికి బయటి వారిని ఎవరిని వెళ్లకుండా చూడటంతో పాటు అక్కడ ప్రత్యేకమైన కరోనా జాగ్రత్తలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారికంగా నిరూపితం అయిన కారణంగా ముంబయిలోని లతా మంగేష్కర్ నివాసంను పూర్తిగా సీల్ చేస్తున్నట్లుగా కార్పోరేషన్ అధికారులు తెలియజేశారు.

భవనాన్ని సీల్ చేసే విషయమై మాకు సమాచారం ఇచ్చారని ప్రస్తుతం మా కుటుంబ సభ్యులందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఎలాంటి ఆందోళన లతాజీ గురించి అక్కర్లేదు అంటూ పేర్కొన్నారు.

లతా మంగేష్కర్ ఇంట్లో వృద్దులు ఎక్కువగా ఉన్న కారణంగా అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ఇంటిని సీల్ చేశారని కొంత కాలం పాటు బయట నుండి కనీసం గాలి కూడా లోనికి వెళ్ల కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు కరోనా బారిన పడ్డ కారణంగా ప్రముఖుల ఆరోగ్యం పట్ల ముంబయి కార్పోరేషన్ ఇలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/