రవిక సొగసు…

Blouse Designs

ఎప్పటికప్పుడు ఏదో కొత్తదనం కన్పించేలా డ్రెస్‌ చేసుకోవడం ఓ కళ. అందుకే అహర్నిశలూ శ్రమిస్తూ అద్భుతమైన డిజైన్లను సృష్టిస్తూనే ఉంటారు డిజైనర్లు. అంతేకాదు, అది ఓ ట్రెండ్‌గా మారేందుకూ కృషిచేస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ ఆ కోవకు చెందినవే.


పెళ్లి దగ్గర పడుతోంది. లేదూ సన్నిహితుల పెళ్లికి హాజరు కావాలి…అనుకోగానే అమ్మాయిలంతా ఏం చేస్తారు ? చీరమీదకి వెరైటీ డిజైన్‌లో బ్లౌజ్‌ కుట్టించుకునేందుకు ఫ్యాషన్‌ మ్యాగజైన్లన్నీ తిరగేస్తుంటారు. హైనెక్‌లు , కాలర్‌ నెక్‌లూ వాటిమీద ఖరీదైన ఎంబ్రాయిడరీలూ.. అన్నీ పాతబడిపోయాయి. కొత్తగా ఎలాంటి డిజైనర్‌ బ్లౌజ్‌ కుట్టించుకోవాలా అనుకుంటున్న వాళ్లకోసం వచ్చిన నయాఫ్యాషనే ఈ కోల్డ్‌ షోల్డర్‌ వెడ్డింగ్‌ బ్లౌజ్‌. నిన్న మొన్నటి వరకూ మోడ్రన్‌, క్రాప్‌ టాప్‌లమీద మాత్రమే హల్‌చల్‌ చేస్తున్న ఈ కోల్డ్‌ షోల్డర్‌ ఫ్యాషన్‌, ఇప్పుడు పెళ్లి బ్లౌజుల్లోకీ ప్రవేశించింది. జాకెట్లకు మాత్రమే కాదు టీషర్టు, చుడీదార్‌లకు చిల్లుల ట్రెండ్‌ నడుస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/movies/