రక్తం వృద్ధి కావాలంటే..

ఆరోగ్యం జాగ్రత్తలు

iron contain food
blood growth-.iron contain food

గోధుమ సంబంధిత వస్తువు ల ద్వారా ఐరన్‌ తగినంత స్థాయిలో మనం పొందవచ్చును. తాజా ఆకుకూరలయిన తోటకూర, బచ్చలికూర, గోంగూర మొదలైన వాటిలో కూడా ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది.

రక్తం వృద్ధి కావడానికి ఐరన్‌ ఉపకరిస్తుంది. కాయగూరల్లో అంటే క్యాబేజీ, కేరట్‌, బీట్‌రూట్‌, టమాటాలలో ఐరన్‌ సమృద్ధిగా ఉంది. vఫలాల విషయానికి వస్తే ద్రాక్ష, యాపిల్‌లలో ఐరన్‌ బాగా లభిస్తుంది.

తరుచూ ద్రాక్ష, యాపిల్‌ తీసుకుంటే రక్తహీనతతో బాధపడేవారు దాని నుండి ఉపశమనం పొందవచ్చును.

రోజువారీ తీసుకునే ఆహారాలైన పాలు, గ్రుడ్లు, వెన్నల ద్వారా ప్రొటీనులను పుష్కలంగా పొందవచ్చును. ఐరన్‌తో పాటు, కాపర్‌ కూడ హిమోగ్లోబిన్‌ నిర్మాణంలో పాలు పంచుకుంటుంది.

కాబట్టి మన శరీరానికి కావలసిన రాగిని కూడా సహజమైన ఆహారాల ద్వారా సమకూర్చు కోవాలి.

మంచినీరు త్రాగేందుకు రాగిపాత్రలను వాడటం మంచిది. విటమిన్‌ బి అనీమియాను తగ్గించేందుకు దోహదపడుతుంది.

జంతువుల నుంచి లభించే ప్రొటీన్‌ యుక్తమైన కిడ్నీలు, లివర్‌ ద్వారా బి12ను అధికంగా పొందే అవకాశముంది.

బీట్‌రూట్‌ను ప్రతిరోజు క్రమం తప్పకుండా తినగలిగితే రక్తం వృద్ధి అవు తుంది.

బీట్‌రూట్‌ తరుచూ తీసుకునే వారిలో ఐరన్‌లోపం ఉండదు.

ఎర్ర రక్తకణాలు లెక్కకు మించి ఎక్కువ గా ఉత్పత్తి అవడానికి తద్వారా బాడీలోని అన్ని టిష్యూ లకు ఆక్సిజన్‌ సరఫరా అయ్యేందుకు బీట్‌రూట్‌
తోడ్పడుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/