రక్తదానం ఆరోగ్యానికి మంచిది

ఆరోగ్య సంరక్షణ

Blood donation is good for health
Blood donation is good for health

రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం వస్తుంది. అది ఆరోగ్యానికి మంచిది అని చెబుతుంటారు. ఆ సంగతి ఎలాగున్నా రక్తంలోని ప్లాస్మా కణాలను సగం వరకూ తొలగించ వాటికి బదులు సెలైన్‌, ఆల్బ్యూమిన్‌లను ఎక్కించడం వల్ల వయస వెనక్కి మళ్లుతుంది అంటున్నారు కాలిపోర్నియా యూనివర్సిటీ నిపుణులు.

వృద్ధ ఎలుకల్లో చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం స్పష్టమైంది.

దీనివల్ల కణజాలాల్లో ముఖ్యంగా మెదడు, కాలేయం, కండరకణాల్లో పునరుత్పత్తి జరిగినట్లు గుర్తించారు. రక్తంలోని ప్లాస్మాలో సగం తొలగించి ఆల్బ్యూమిన్‌ను ఎక్కించడం వల్ల కొత్త ప్రొటీన్‌ కణాలు విడుదలవుతాయి.

అదే సమయంలో ప్లాస్మా గాఢతా తగ్గుతుంది. అంటే వయసుమీరిన ప్రొటీన్‌కణాల శాతం తగ్గిపోతుందన్నమాట.

దాంతో పాత, కొత్త ప్రొటీన్‌ కణాల సమతౌల్యం ఏర్పడుతుంది. తద్వారా వృధ్దాప్యం రాకుండా ఉంటుందనేది శాస్త్రనిపుణుల విశ్లేషణ.

తీపి ఎందుకు మంచిది కాదు

చక్కె పానీయాలు, మిఠాయిలు ఆరోగ్యానికి మంచివికాదనీ అవి ఊబకాయానికీ దారితీస్తాయనేద తెలిసిందే. అయితే అది ఎందుకున్న విషయాన్ని ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు మిచిగన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు.

తీపి పదార్థాలు మెదడు రసాయనాల్లో మార్పులకు గురిచేసి తద్వారా కీలక నాడుల్ని పనిచేయకుండా చేస్తాయట.

మొదట్లో చక్కెర పదార్థాలు కొద్దిగా తిన్నప్పుడు మెదడులో డపమైన్‌ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. దాంతో మళ్లీమళ్లీ తినాలనిపిస్తుంది.

క్రమంగా అది మత్తుమందులా అలవాటైపోతుంది. డోపమైన్‌ శాతం తగ్గిపోయి, ఎంత తీపి తిన్నా సంతృప్తిగా అనిపించదు.

ఫలితంగా అతిగా తినడం అలవాటుగా మారి, ఊబకాయానికి దారితీస్తుందట. అందుకే చక్కెరను తినడం ఏ రకంగానూ మంచిది కాదు అంటున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/