ఆ సైట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయండి

Delhi High Court
Delhi High Court

న్యూఢిల్లీ:అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌‌.. తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను, వెబ్‌ సిరీస్‌లను అనధికారికంగా తమిళ్‌ రాకర్స్‌ ఈజెడ్‌ టీవీ, కట్‌మూవీస్‌, లైమ్‌ టొరెంట్స్‌  వంటి ప్రైవేటు వెబ్‌సైట్స్‌ వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నాయి అని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. పిటిషన్‌ను స్వీకరించి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్‌ నారులా.. అటువంటి వైబ్‌సైట్లకు నెటిజన్స్‌ ప్రవేశించకుండా వాటి యూఆర్‌ఎల్స్‌(యూనిఫాం రిసోర్స్‌ లెకేటర్స్‌), ఐపీ అడ్రెస్‌లను బ్లాక్‌ చేయవలసిందిగా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను(ఐ.ఎస్‌.పి) ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అంతేకాక నిర్మాణ సంస్థలకు చెందిన కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఆ వెబ్‌సైట్లపై నమోదు చేసిన డొమైన్‌ పేర్లను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు మార్గనిర్దేశం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/