మహిళలను ఈ విధంగా వాడుకుంటున్నారు


సెక్స్‌రాకెట్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమర్శలు

honey trap
honey trap


భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో హనీట్రాప్‌ సెక్స్‌రాకెట్‌ గుట్టు రట్టు కావడంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నారని కమల్‌నాథ్‌ ప్రభుత్వంపై కుట్రపన్నుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మణ్‌ సింగ్‌ ఆరోపించారు. అధికారం కోసం సెక్స్‌ రాకెట్‌ నడిపి రాజకీయాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం ఈ విధంగా మహిళలను వాడుకుని నాటకం ఆడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని, కొందరు నేతలు మహిళలను ఇందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. అభ్యంతరక వీడియోలు సృష్టించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలను బ్లాక్‌ మెయిల్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/