రాకేశ్ టికాయిత్​పై ఇంక్ దాడి

Black ink thrown at Bharatiya Kisan Union leader Rakesh Tikait in Bengaluru

బెంగళూరు: సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్​పై సిరా దాడి జరిగింది. బెంగళూరులో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయనపై కొందరు ఇంక్ పోశారు. ఈ పరిణామంతో అక్కడున్న వారంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. సిరా దాడి చేసిన వారిని అడ్డుకుని, కొట్టారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సిరా దాడిపై తీవ్రంగా స్పందించారు రాకేశ్ టికాయిత్. తన కార్యక్రమానికి స్థానిక పోలీసులు సరైన భద్రత కల్పించలేదని విమర్శించారు. కొందరితో ప్రభుత్వం కుమ్మక్కై ఇలా చేసిందని ఆరోపించారు.

కాగా, భారతీయ కిసాన్​ యూనియన్​ నాయకుడు రాకేశ్​ టికాయిత్​పై సిరా దాడి ఘటనపై చర్యలు చేపట్టారు బెంగళూరులోని హైగ్రౌండ్స్ ఠాణా​ పోలీసులు. ఇంక్​ చల్లినట్లు భావిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/