పైలట్ లేకుండానే ప్రయాణించిన హెలికాప్టర్

అమెరికా: అమెరికాలోని కెంటకీలో ఓ బ్లాక్ హాక్ హెలికాప్టర్ పైలట్ లేకుండానే ప్రయాణించింది. దేశ ఆర్మీ అధికారులు పైలెట్ లేకుండా వెళ్లగలిగే అటానమస్ ‘బ్లాక్ హాక్’ హెలికాప్టర్ ను టెస్ట్ చేశారు. ఈ ఛాపర్ 30 నిమిషాల ప్రయాణించి సురక్షితంగా ల్యాండింగ్ అయింది. సిమ్యులేషన్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఊహాజనిత సిటీలోని బిల్డింగులను దాటేస్తూ ముందుకెళ్లింది. గంటకు 190 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వేగంతో 4 వేల అడుగుల ఎత్తులో ఎగిరింది. రెట్రోఫిట్ చేయబడిన వర్లీబర్డ్ సికోర్స్కీ-నిర్మిత స్వయంప్రతిపత్తి వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతుంది. బ్లాక్ హాక్‌ను పైలట్ లేకుండా గాలిలోకి పంపడం ఇదే మొదటిసారి. కాగా, US మిలిటరీ ఐకాన్ అయిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఈ వారం ప్రారంభంలో కెంటుకీలో మొదటిసారిగా పైలట్ లేకుండా ప్రయాణించింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/