గుంటూరులో బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ల ముఠా అరెస్ట్

46 Amphotericin-B ఇంజక్షన్లు , రూ. 3 లక్షలు స్వాధీనం

Guntur Range IG Trivikrama Varma, Guntur Urban SP Arif Hafeez revealing details
Guntur Range IG Trivikrama Varma, Guntur Urban SP Arif Hafeez revealing details
Injections-cash seized by police

Guntur: గుంటూరులో బ్లాక్ ఫంగస్ కు సంబంధించిన Amphotericin-B అనే ఇంజక్షన్ లను ప్రభుత్వ ధరలకంటే బ్లాక్ మార్కెట్ లో సుమారు 10 రేట్లు ఎక్కువగా ధర చేసి విక్రయిస్తున్న గ్యాంగ్ ను గుంటూరు అర్బన్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 46 Amphotericin-B ఇంజెక్షన్లు , రూ 3 లక్షల 4 వేలను స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు అర్బన్ ఏపీకి వచ్చిన సమాచారం మేరకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పాత గుంటూరు పోలీసు స్టేషన్ మరియు ఇతర పోలీసు స్టేషన్ ల పరిధిలో బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఉపయోగించే ఇంజక్షన్ ల బ్లాక్ మార్కెట్ పై దర్యాప్తు చేపట్టగా 8 మంది యువకులు పట్టుబడ్డారు .. వీరిని అరెస్ట్ చేసి ఇంజక్షన్ లను, నగదులు స్వాదేనం చేసుకున్నారు.

వీరిలో కొందరు మెడికల్ రిప్రజెంటేటివ్ల తోపాటు షాపుల నిర్వాహకులు ఉన్నారు. ఈమేరకు ఆదివారం మీడియా సమావేశంలో గుంటూరు రేంజ్ ఐజి డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ వివరాలను వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/