సీఎం జగన్‌ మూడు కళ్ల సిద్ధాంతం కంటితుడుపు చర్యే

ramesh naidu
ramesh naidu

తిరుపతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మూడు కళ్ల సిద్దాంతం కేవలం కంటి తుడుపు చర్యేనని బిజెపి యూవమోర్చ అధ్యక్షుడు రమేష్‌ నాయుడు ఆరోపించారు. ఈరోజు ఆయన తిరుపతిలో మీడియాలో మాట్లాడుతూ.. గింజలు చల్లి పావురాలు పట్టే విధంగా సీఎం జగన్‌ పరిపాలన ఉందని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమకు కావాల్సింది నికరజలాలు, ఉపాధినిచ్చే పరిశ్రమలు అని అన్నారు. హైకోర్టు రాయలసీమకు రావాలనే బిజెపి కోరుకుందని రమేష్‌ నాయుడు తెలిపారు. గొప్ప రాజధాని నిర్మాణం కావాలని సీఎం జగన్‌ గతంలో అసెంబ్లీలో అన్నారు. ఇప్పుడు ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నాలుగున్నరెళ్ల క్రితం ఉన్న గందరగోళ పరిస్థితులు మళ్లీ ఉత్పన్నమయ్యాయి అని రమేష్‌ నాయుడు విమర్శించారు. ప్రాంతీయ పార్టీల వల్ల ప్రయోజనం లేదని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. చంద్రబాబుతో జగన్‌కు ఉన్న వైరానికి సామాన్య ప్రజలు బలైపోతున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో 3 రాజధానులు మంచిదన్న చిరంజీవికి ఏపీలో ఓటు హక్కే లేదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో లాభాపేక్ష కోసమే చిరంజీవి సీఎం జగన్‌కు మద్ధతు ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన జీఎన్‌రావు కమిటీ నివేదిక కట్‌ అండ్‌ పేస్ట్‌లా ఉందని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/