మునుగోడు లో బిజెపి గెలుపు ఖాయం..అప్పుడే పండగలు చేసుకుందాం – బండి సంజయ్

bjp-bandi-sanjay-replies-to-ktr-tweet

మునుగోడు లో బిజెపి గెలుపు ఖాయం..అప్పుడే దసరా , దీపావళి పండగలు చేసుకుందాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ఆసక్తి నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో టిఆర్ఎస్ , కాంగ్రెస్ , బిజెపి పార్టీ లు ఈ స్థానం ఫై ఫోకస్ పెట్టాయి. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ట్రై చేస్తున్నారు . తాజాగా ఈ ఉప ఎన్నికకు సంబదించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 14 వరకు నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. అలాగే.. 17 వరకు ఉపసంహరణ కార్యక్రమం ఉండనుంది. ఇక నవంబర్‌ 3 న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇక మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. సర్వేలన్నీ మునుగోడులో బిజెపి విజయం ఖాయమని తేల్చాయని అన్నారు. మునుగోడులో బీజేపీ దమ్మేంటో చూపిద్దాం. ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్‌ అస్సలు కనిపించదు.. ఓటుకు 30 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్‌ కుట్ర పన్నుతున్నారు. అందుకే మునుగోడులో రాజగోపాల్‌ రెడ్డిని గెలిపిద్దాం.. కమల వికాసానికి పటు పడదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెబుతున్నారు. ఎన్నిక ఫలితాల తర్వాతే దసరా, దీపావళి చేసుకుందాం.. అంతవరకు అన్ని పనులు పక్కనబెట్టి మునుగోడులో మకాం వేయాలని.. ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో నేతలతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.