ఈ నెల 7న బిజెపి మేనిఫెస్టో!

rajnath, modi, amit shah
rajnath, modi, amit shah


హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల కోసం తన మేనిఫెస్టోను ఈ ఆదివారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలస్తుంది. ఏడు దశల్లో జరిగే ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ ఈ నెల 11న జరుగుతుంది. ప్రధాని మోది, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌తో పాటు మరికొంత మంది నేతలు ఆదివారం బిజెపి మేనిఫెస్టోను విడుదల చేస్తారని సమాచారం. మొత్తం 20 మంది సభ్యులు మేనిఫెస్టొపై కసరత్తు చేశారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో మేనిఫోస్టో రూపకల్పన జరిగింది. మేనిఫెస్టో కమిటీలో జైట్లి, సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, రవిశంకర్‌ ప్రసాద్‌లు ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో పోలింగ్‌ తేదికి కొన్ని రోజుల ముందే బిజెపి తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఐతే పోలింగ్‌కు రెండు రోజుల లోపు మేనిఫెస్టో విడుదల చేయరాదన్న ఎన్నికల సంఘం ఆదేశాలున్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/