కర్ణాటక ఉప ఎన్నికలలో బిజెపి జోరు

yeddyurappa
yeddyurappa

బెంగళూరు: కర్ణాటక లో జరిగిన ఉప ఎన్నికలలో 12 స్థానాలలో బిజెపి విజయం సాధించింది.
ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అయితే రెండు స్థానాలతో కాంగ్రెస్ సరిపెట్టుకోగా ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. జెడిఎస్ ఎక్కడ పోటీ ఇవ్వకుండా ఉప ఎన్నికల నుంచి నిష్క్రమించింది. గెలిచిన 12 మందిలో 11 మందికి మంత్రి పదవులు దక్కనున్నట్టు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్‌కు కన్నడ ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా వెళ్లిన ఏ రాజకీయ పార్టీలకైన ఈ ఫలితాలు ఓ సందేశాన్ని ఇస్తాయన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుకు సంతోషంగా ఉన్నానని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. ఇప్పుడు మెజారిటీ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీలో 223 స్థానాలకు 117 స్థానాలలో గెలిచి యడ్యూరప్ప ప్రభుత్వంలో కొనసాగనున్నారు. రెండు ఎంఎల్ఎ స్థానాలు కోర్టు పరిధిలో ఉన్నాయి.

తాజా మూవీస్ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/news/movies/