2023లో తెలంగాణాలో బిజెపిదే ప్రభుత్వం

Muralidharrao
Muralidharrao

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే రాష్ట్రంలో 27 మంది ఇంటర్‌ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని బిజెపి నేత మురళీధర్‌రావు ఆరోపించారు. విద్యార్ధుల ఆత్మహత్యపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామని, మంగళవారం ఇక్కద మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో కాంట్రాక్టర్లు, కమీషన్ల ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ రెండూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని పేర్కొన్నారు. తెలంగాణలో బిజెపిని పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. 2023లో తెలంగాణాని ఏలేది బిజెపినేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/