టిడిపిని ఇబ్బంది పెట్టేందుకే మూడు రాజధానులు

vishnu vardhan reddy
vishnu vardhan reddy

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి టిడిపిని గందరగోళంలోకి నెట్టేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు. టిడిపిని ఇబ్బంది పెట్టేందుకే పరిపాలన వికేంద్రీకరణ అంటూ వైఎస్‌ఆర్‌సిపి ఎత్తుగడ వేస్తోందన్నారు. విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ రోజు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన ప్రజలకు ఉపయోగపడేలా లేదని ఆయన విమర్శించారు. కర్నూలుకు జ్యూడీషియల్‌ క్యాపిటల్‌ ద్వారా ఎంలాభం అన్నారు. జిరాక్స్‌ మిషన్లు, నాలుగు న్యాయవాదుల భవనాలు తప్ప కర్నూలుకు హైకోర్టుతో ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ? లేక అధికార వికేంద్రీకరణా? అనే సందిగ్ధంలో రాష్ట్రా ప్రజలు ఉన్నారని తెలిపారు. అమరావతిలో సచివాలయం మరియు అసెంబ్లీ ఉండాలనేది బిజెపి నిర్ణయమని విష్ణువర్ధన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాగా గతంలో టిడిపి హయంలో రాజధాని నిర్మాణంలో కుంభకోణం జరిగిందంటున్నారు. మరి గతంలో జరిగిన టిడిపి అవినీతిని ఎందుకు నిరూపించట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. పరిపాలన వికేంద్రీకరణ చేసినంత మాత్రనా అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందవు అని గుర్తుచేశారు.

తాజా తెలంగాణ వర్తాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/