తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి ప్లాన్ ఇదేనా..?

BJP
BJP

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బిజెపి సరికొత్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస కు దీటుగా ఉన్న పార్టీ అంటే అది బిజెపి నే అని అంత మాట్లాడుకుంటున్నారు.

రీసెంట్ గా హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ గెలిచి తెరాస కు షాక్ ఇచ్చారు. ఈ షాక్ తో తెరాస జాగ్రత్త పడుతుంది. మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి ఓ లెక్క అన్నట్లు ఎన్నికల విషయంలో జాగ్రత్తలు పడుతుంది. స్థానిక సంస్థల్లో బీజేపీకి ఏ మాత్రం బలం లేదు. కానీ కొన్ని స్థానాల్లో బరిలో దిగి క్రాస్ ఓటింగ్ చేయించుకుని టీఆర్ఎస్‌కు చెక్ పెట్టాలని చూస్తుంది. అలాగే టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ సీట్లు దక్కని అసంతృప్తి నేతలని బీజేపీలోకి తీసుకొచ్చి సీటు ఇచ్చి నిలబెట్టాలని బిజెపి చూస్తుంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అభ్యర్ధులని పెట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ కూడా కొన్ని చోట్ల పోటీకి దిగేలా ఉంది. ఒక వేళ ఇదే జరిగితే క్రాస్ ఓటింగ్ జరగడం..తెరాస కు ఇబ్బంది గా మారడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.