గూగుల్‌ ప్రకటనల్లో కమలమే ముందంజ

bjp ads in google
bjp ads in google


న్యూఢిల్లీ: ఇంటర్నెట్‌ సంస్థ గూగుల్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఐతే ఫిబ్రవరి 19 నుంచి ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం 37 కోట్లు ఖర్చు చేశాయి. 831 ఎన్నికల యాడ్స్‌ ఇప్పటి వరకు గూగుల్‌లో రిలీజ్‌ అయ్యాయి. బిజెపి యాడ్స్‌ లిస్టులో ముందంజలో ఉంది. ఈ పార్టీ యాడ్స్‌ కోసం ఏకంగా 1.21 కోట్లు ఖర్చు చేసింది. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే ఆరవ స్థానంలో నిలిచింది. ఆ పార్టీ కేవలం 54 వేలు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్‌ఆర్‌సిపి రెండవ స్థానంలో ఉంది. ఈ పార్టీ 1.04 కోట్లు ఖర్చు చేసింది. టిడిపి పార్టీ మూడవ స్థానంలో నిలిచింది. ఆ పార్టీ యాడ్స్‌ కోసం 85 లక్షలు ఖర్చు చేసింది. ఎన్నికల ప్రకటనల కోసం అత్యధికంగా ఖర్చు చేసిన రాష్ట్రాల్లో ఏపి, తెలంగాణలు ఉన్నాయి. యుపిలో 18 లక్షలు, మహారాష్ట్రలో 17 లక్షలు ఖర్చు చేశారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/