గవర్నర్ తమిళిసైను కలసిన బీజేపీ బృందం

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను బీజేపీ నేత రామచంద్రరావు బృందం కలిసింది. అనంతరం రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ 317 జీవో ఉపసంహరణ చేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. 371డీ ప్రకారం నియామకాలు చేయాలనే ఆదేశాలున్నాయని, రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళామన్నారు. కొంతమంది ఉద్యోగులు-యూనియన్లకు అనుకూలంగా జీవో ఉందని, హైకోర్టు-సుప్రీంకోర్టు ఆర్డర్లను గవర్నర్‌కు చూపించినట్లు చెప్పారు. 317 జీవో ఉపసంహరణ చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని రామచంద్రరావు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/