ప్రజ్ఞాసింగ్‌ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

కేంద్రమంత్రి అమిత్‌ షా

Amit Shah
Amit Shah

ముంబయి: బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ జాతిపిత మహాత్మ గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రజ్ఞాసింగ్‌ వ్యాఖ్యల్ని బిజెపి పార్టీ, ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన ఆయన మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. ఇంతకు మునుపు దీనిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు. అయినా ప్రభుత్వం తరపున మరోసారి ప్రజ్ఞా వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని అమిత్‌ షా ఈ సందర్బంగా స్పంష్టం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ప్రజలు భయపడుతున్నారని, ఇంలాంటి పరిస్థితులు దేశంలో ఎందుకు నెలకొన్నాయని ప్రముఖ వ్యాపారవేత్త రాహుల్‌ బజాజ్‌ అమిత్‌ షాను ప్రశ్నించారు. కాగా ప్రజలు భయపడవల్సిన అవసరం లేదని అమిత్‌ షా అన్నారు. వాస్తవానికి అలాంటి వాతావరణం కనుక నెలకొంటే, దానిని తొలగించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. నరేంద్ర మోడి ప్రభుత్వంపై కూడా మీడియాలో విమర్శలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/