లక్ష్మణ్‌కు హైకమాండ్‌ తక్షణ పిలుపు

K. Laxman
Laxman

హైదరాబాద్‌: ఆర్టీసి సమ్మెపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తూనే ఉంది. ఎంపి బండి సంజయ్‌ విషయంలో పోలీసుల తీరుపై బిజెపి పెద్దలు గుర్రుగానే ఉన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను ఢిల్లీకి రావాలని హైకమాండ్‌ ఆదేశించింది. దాంతో లక్ష్మణ్‌ ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్రం కూడా ఆర్టీసి సమ్మెపై, కార్మికుల సమస్యలపై నివేదికలు తెప్పించుకుంటూనే ఉంది. కాగా ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఆయన కలిసి ఆర్టీసి సమ్మెపై నివేదికను సమర్పించనున్నారు. అంతకుమునుపే ఈ విషయంపై చర్చించేందుకు టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, ఆర్టీసి జేఎసి నేత అశ్వత్థామరెడ్డి తదితరులు
లక్ష్మణ్‌ను కలిసి కార్మికుల సమ్మెపై, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చలు జరిపినట్లు సమాచారం.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/