ఎన్నికల ఖర్చులో బిజెపిదే అగ్రస్థానం

BJP
BJP

న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే అందరికీ క్రేజ్‌. ఎన్నికల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల ఖర్చే అందుకు నిలువెత్తు నిదర్శనం. 17 వ లోక్‌సభలో నగదు ప్రభావం, ప్రవాహం రికార్డు స్థాయిలో జరిగినట్లు ఢిల్లీకి చెందిన సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌(సిఎంఎస్‌) అనే సంస్థ కూడా అధ్యయనం చేసింది. ఈ సంస్థ వెల్లడించిన ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్నికల ఖర్చు అక్షరాల రూ. 60 వేల కోట్లని చెప్పిన విషయం తెలిసిందే.
సిఎంఎస్‌ లెక్కల ప్రకారం …ఈ ఏడాది ఎన్నికల ఖర్చు రూ. 60 వేల కోట్లు. ఈ మొత్తంలో బిజెపి వ్యయం 45శాతం, కాంగ్రెస్‌ వాటా 40 శాతం, 1998 నుంచి 2019 వరకు ఎన్నికల ఖర్చు ఆరు రెట్లు పెరిగింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/