ప్రధాని మోడిపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని ఆరోపణలు

Rahul Gandhi
Rahul Gandhi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడిపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అణగారిన వర్గాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించే దిశగా ప్రధాని నరేంద్ర మోడి అడుగులు వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఉదయం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని మండిపడ్డారు. సమీప భవిష్యత్తులో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించేందుకు బిజెపి ప్రయత్నం చేయనుందని, తాము దాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. కాగా, ఎస్సీ, ఎస్టీలకు నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని, దానిపై తామేమీ కొత్త ఆదేశాలు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/