ఈశాన్యరాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థుల జాబితా

BJP party
BJP party

ఇటానగర్‌: అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ గురువారం విడుదల చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఆరుగురు, సిక్కింలో 12 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ 11న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కూడా
బీజేపీ  నేడు విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే 250 మంది అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సారి సిట్టింగ్‌ ఎంపీలకు కాకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలని
బీజేపీ  భావిస్తోంది.