ఈ మ్యాజిక్‌ అర్థమేమిటి రాహుల్‌జీ

బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎద్దేవా

JP Nadda- Rahul Gandhi
JP Nadda- Rahul Gandhi

New Delhi: వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలని అప్పుడు పార్లమెంటులో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ ఇపుడు సంస్కరణలను వ్యతిరేకించడంలో ఆంతర్యం ఏమిటని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ధ్వజమెత్తారు. రాహుల్‌ లోక్‌సభలో చేసిన ప్రసంగం పాత విడియోను ఈ సందర్భంగా నడ్డా మీడియాకు విడుదలచేసారు. రైతులు మధ్యవర్తులు, దళారీల పాత్ర లేకుండా తమ ఉత్పత్తిని తామేనేరుగా విక్రయించుకునేందుకు వీలుగా సంస్కరణలు అవసరమని రాహుల్‌ చేసిన ప్రసంగాన్ని నడ్డా గుర్తుచేసారు. ఇపుడు అనుసరిస్తున్న వైఖరికి సంబంధించి మీ మ్యాజిక్‌ ఏమిటి రాహుల్‌జీ అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇపుడుమీరు వ్యతిరేకస్తున్న సంస్కరణలనున గతంలో మీరు మద్దతిచ్చినవా కాదా అని పేర్కొన్నారు. రైతుల ఆసక్తిని గమనించి అందుకు తగినట్లు మీరు వ్యవహరించడంలేదని ఆయన పేర్కొన్నారు.
రైతులతో రాజకీయాలు చేస్తున్నారని, అయితే మీ పైత్యం ఎంత మాత్రం పనిచేయదని పేర్కొన్నారు. మీ ద్వంద్వ ప్రమాణాలను భారత రైతులు గుర్తించారని పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ పార్టీ రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలకు మద్దతిచ్చింది. మూడు చట్టాలను రద్దుచేయాలన్న రైతుల డిమాండ్‌తో ఏకీభవించింది. అమేథి నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన రాహుల్‌ ఆనాడు లోక్‌సభలో మాట్లాడుతూ యుపిలో తాను పర్యటించిన సమయంలో ఆలుగడ్డల చిప్స్‌ ప్యాకెట్‌ పది రూపాయలు పలుకుతున్నదని, రైతుల ఆలుగడ్డలకు మాత్రం కిలోకు రెండు రూపాయలు ఇస్తున్నారు. దీనిపై రైతులు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలు తమ పొలాలకు దూరంగా ఉన్నాయని, తాము తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించు కోలేమని, అందువల్ల తమవద్దకు వచ్చేవారికే విక్రయించాల్సివస్తోందని చెప్పారు. అమేథిలో ఫుడ్‌పార్కును మోడీ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని రాహుల్‌ ఆరోపించారు. అయితే ఈ ఫుడ్‌పార్కుకు భూ సమస్య ఎదురయిందని అందువల్లనే అమలుకు రాలేదని ప్రభుత్వం రాహుల్‌ విమర్శలను తిప్పికొట్టింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/