రాహుల్‌, సోనియాల ఓటమికి బిజెపి ప్రణాళిక

rahul gandhi, sonia gandhi
rahul gandhi, sonia gandhi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రా§్‌ుబరేలీలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీలను ఓడించేందుకు బిజెపి మాస్టర్‌ ప్లాన్‌ రెడి చేసింది. ఈసారి ఎలాగైనా కాంగ్రెస్‌ కంచుకోటలను తమ సొంతం చేసుకోవాలని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోడీ భావిస్తున్నారు. అమేథీలో రాహుల్‌ గాంధీపై బిజెపి అభ్యర్ధిగా కేంద్రమంరతి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌ చేతిలో ఆమె లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఈ సారి అమేథీలో రాహుల్‌ గాంధీని ఓడించేందుకు స్మృతి ఇరానీ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అమేథీలో గెలుపుపై నమ్మకం లేకే రాహుల్‌ వయనాడ్‌లో పోటీ చేస్తున్నారని ఆమె ప్రచారం చేస్తున్నారు.
రా§్‌ుబరేలీలో సోనియాగాంధీపై మాజి కాంగ్రెస్‌ నేత దినేష్‌ సింగ్‌ను బిజెపి పోటీలో నిలిపింది. ఆయన గెలుస్తారని ధీమాగా ఉంది. అమేథీలో బిజెపి గెలుపు బాధ్యతను పార్టీ నాయకత్వం సంజీవ్‌ బలియాకు అప్పగించినట్టు తెలుస్తోంది. రా§్‌ుబరేలిలో సోనియాగాంధీని ఓడించే బాధ్యతను బిజెపి నేత మహేశ్‌ శర్మకు అధినాయకత్వం అప్పగించినట్టు సమాచారం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎస్పీ-బిఎస్పీ కూటమి పోటీలో లేకపోవడంతో వారి ఓటు బ్యాంకు ఆకర్షించే పనిలో బిజెపి నిమగ్నమైంది.ఐదో విడత పోలింగ్‌లో భాగంగా మే 6న అమేథీ, రా§్‌ుబరేలీలో ఎన్నికలు జరగనున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/