ఈరోజు మునుగోడు లో బిజెపి సమరభేరి..

ఈరోజు మునుగోడు లో బిజెపి సమరభేరి పేరిట సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు ముఖ్య అతిధి గా కేంద్ర మంత్రి అమిత్ షా హాజరుకాబోతున్నారు. అలాగే అమిత్ షా సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోబోతున్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో మునుగోడు కు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. ఎలాగైనా ఉప ఎన్నిక లో గెలిచి తీరాలని సన్నాహాలు చేస్తూ..ప్రచారం మొదలుపెట్టాయి. నిన్న టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధి గా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై బిజెపి ఫై నిప్పులు చెరిగారు. బిజెపి కి ఓటు వేస్తే బావుల దగ్గర మీటర్లు పెట్టడం ఖాయమని హెచ్చరించారు. 2000 పెన్షన్ ఇచ్చే టిఆర్ఎస్ కావాలా..600 పెన్షన్ ఇచ్చే బిజెపి కావాలో తేల్చుకోవాలని అన్నారు. ఓటు వేసేటప్పుడు ఇంట్లో గ్యాస్ కు దండం పెట్టుకోమని , రైతులు బావుల దగ్గర మోటార్లను చూడాలని అన్నారు. అంతే కాదు అమిత్ షా ..మోడీ లపై విరుచుకపడ్డారు. మరి కేసీఆర్ వ్యాఖ్యల ఫై ఈరోజు జరగబోయే బిజెపి సభ లో నేతలు ఎలా సమాదానాలు ఇస్తారో..ఎలాంటి ఆఫర్లు ఇస్తారో చూడాలి.

ఇక అమిత్ షా షెడ్యూల్ చూస్తే..

మధ్యాహ్నం 3.30 గంటలకు అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి సాయంత్రం నాలుగున్నర గంటలకు మునుగోడుకు చేరుకుంటారు. అనంతరం మునుగోడు లో దళిత కార్యకర్త ఇంట్లో భోజనం చేయనున్న అమిత్ షా… రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం సభలో పాల్గొననున్నారు. సభ ముగిశాక రామోజీ ఫిల్మ్ సిటీ కి వెళ్లనున్న షా… ఈరోజు రాత్రి నోవాటెల్ లో బిజెపి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇక ఈరోజు సభలో రాజ్ గోపాల్ రెడ్డి మాత్రమే కండువా కప్పుకుంటరాని… నియోజక వర్గానికి సంబంధం లేని నేతల చేరికలు ఈరోజు ఉండవని బిజెపి నేతలు చెబుతున్నారు.