రాజధానిని కదిలిస్తే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుంది

sujana chowdary
sujana chowdary

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని బిజెపి ఎంపీ సుజనా చౌదరి విమర్శించారు. అమరావతిలో అంగుళం కూడా రాజధానిని కదిలించడానికి వీల్లేదని సుజనా చౌదరి అన్నారు. రాజధానిని కదిలిస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందన్నారు. సీఎం జగన్‌ ఇలాగే ముందుకెళ్తే పనామా, వెనెజులా స్థాయికి రాష్ట్రం వెళ్తుంది అని చెప్పారు. రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాజధాని అంటే ఒక కారు అమ్మేసి మరో కారు కోనుక్కోవడం కాదని పేర్కొన్నారు. జీఎన్‌రావు కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని సుజనా విమర్శించారు. రాజధాని అంశాన్ని జీఎన్‌ రావు కమిటీకి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రశ్నించారు. ప్రభుత్వం కార్యాలయాలను పలుచోట్ల పెడితే ఎలాంటి లాభం లేదని అన్నారు. మూడు రాజధానుల ప్రస్తావన ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. రాజధాని సమస్య పరిష్కారం అయ్యే వరకూ 13 జిల్లాల ప్రజలు స్పందించాలి. అమరావతి కోసం బిజెపి శ్రేణులంతా పోరాటం చేయాలని సుజనా చౌదరి పిలుపునిచ్చారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/