లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా!

om birla
om birla

న్యూఢిల్లీ: రేపు జరగబోయే 17వ లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికల్లో రాజస్థాన్‌ కోటా ఎంపి ఓం బిర్లానే ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈయన పేరు దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 17వ లోక్‌సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్రకుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత నూతన ఎంపీలతో ప్రొటెం స్పీకర ప్రమాణం చేయించారు. ఈ రోజు కూడా నూతన ఎంపీలు ప్రమాణస్వీకారాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక చేపట్టనున్నారు. ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/