టిఆర్‌ఎస్‌, ఎంఐఎంలపై విరుచుకుపడ్డ బిజెపి ఎంపి

Dharmapuri Arvind
Dharmapuri Arvind

నిజామాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీలపై బిజెపి ఎంపి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం, టిఆర్‌ఎస్‌కు బిజెపి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. కేవలం ముస్లింలకు మాత్రమే కెసిఆర్‌ మఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారా? అని నిలదీశారు. హిందువులు ఓట్లు వేయకుండానే టిఆర్‌ఎస్‌కు 90 మంది ఎమ్మెల్యేలు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లకోసం పౌరసత్వ చట్టాన్ని కెసిఆర్‌ వ్యతిరేకిస్తున్నారు. కెసిఆర్‌కు గడ్డం లేదని, అసదుద్దీన్‌ గడ్డం కోసి కెసిఆర్‌కు అతికిస్తే అతడు కూడా ముల్లా అవుతాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా సొంత తమ్ముడిని, తన సొంత ఇలాకాలో కత్తులతో, తుపాకులతో దాడి చేస్తే కాపాడుకోలేని వ్యక్తి అసదుద్దీన్‌ అని దూషించారు. అలాంటి వాడు బిజెపిని ఏదో చేస్తానని మాట్లాడడం హస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ముందు తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని అసదుద్ధీన్‌ ఓవైసీకి ఎంపి అరవింద్‌ సూచించారు. నిజామాబాద్‌ మేయర్‌ పదవిని ఎంఐఎంకు అప్పగించేందుకు టిఆర్‌ఎస్‌ యత్నింస్తోందని మండిపడ్డారు. ఎంఐఎంకు తొత్తులా కెసిఆర్‌ వ్యవహరిస్తున్నారని అరవింద్‌ విమర్శించారు. నిజామాబాద్‌ బిజెపి గడ్డ అని, ఓవైసీ ఇక్కడ చేసేదేమి లేదని ఎంపి అరవింద్‌ అన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/