సిఎంపై ఎంపి అర్వింద్‌ విమర్శలు

mp arvind
mp arvind

నిజామాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కెసిఆర్‌, ఒవైసిలు మత రాజకీయాలు చేస్తున్నారని నిజామాబాద్‌ ఎంపి అర్వింద్‌ ఆరోపించారు. మున్సిపల్‌ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయాలు మొదలు పెట్టారన్నారు. సీఏఏతో దేశ ప్రజలకు ఏం సంబంధం. ఎలాంటి ప్రకటన రాని ఎనార్సీపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కెసిఆర్‌ అండతో ఎంఐఎం నిజామాబాద్‌లో సభ నిర్వాహణకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల కోడ్‌ రాకుండానే ర్యాలీలు, సభలకు ఎలా అనుమతిస్తున్నారని ప్రశ్నించారు. ఒవైసీ చేతిలో కెసిఆర్‌ కీలుబొమ్మలా మారారు. తెలంగాణలో సిఎం మతసామరస్యాన్ని ఫణంగా పెడుతున్నారని అర్వింద్‌ ఆగ్రహించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/