టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోంది

Dharmapuri Arvind
Dharmapuri Arvind

నిజామాబాద్‌: ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రభుత్వంపై బిజెపి ఎంపీ అరవింద్‌ తీవ్ర విమర్శలు చేశారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని అరవింద్‌ విమర్శించారు. ఈ రోజు ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఓవైసీ పెద్ద కొడుకూలా మారారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యానే ఓవైసీ నిజాబాద్‌లో సభ పెట్టారన్నారని అన్నారు. జనగణమన పాడని అసదుద్దీన్‌ ఓవైసీ సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పూర్వీకుల గురించి బయటపడుతుందనే ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. సీఎఎ, ఎన్‌ఆర్‌సీలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గదని, ఖరఖండిగా అమలు చేస్తుందని అరవింద్‌ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆయన మండిపడ్డారు. మైనారిటీ ఏరియాలో తన పర్యటన వద్దని పోలీసులు చెబుతున్నారని..ఈ దేశం ఎటు పోతుందని అరవింద్‌ ప్రశ్నించారు. ఎంపీకే రక్షణ ఇవ్వలేకపోతే సీఎం కెసిఆర్‌ ఏం చేస్తున్నట్లు అని దుయ్యబట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/