బిజెపి ఎమ్మెల్యే పై దుండగుల కాల్పులు

లక్నో : హోలి వేడుకల్లో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే యోగేశ్‌ వర్మపై గుర్తుతెలీని ఆగంతకులు సమీపంనుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖిమ్‌పూర్‌ ఖేరి జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మద్యాహ్నం మూడు గంటలకు జరిగిన ఈసంఘటనలో ఎమ్మెల్యే రాజ్‌ఘర్‌లోని తన నివాసానికి బయల్దేరుతుండగా దుండగులు కాల్చినట్లు తేలింది. ఆయన కార్యాలయం నగరంలోని పటేల్‌నగర్‌ ప్రాంతంలో ఉంది. గురునానక్‌ ఇంటర్‌కళాశాలవద్దకు రాగానే గుర్తుతెలీని దుండగులు వర్మను కాల్చిచంపారు. కుడిమోకాలు దిగువనకాల్పులుజరిగాయనిఖేరీపోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఎమ్మెల్యే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లిచేరారు. వైద్యులు ఆయనకు చికిత్సలు అందించి ప్రస్తుతం ప్రమాదంలేదని అన్నారు. లఖింపూర్‌ డిప్యూటిఎస్‌పి విజ§్‌ు ఆనంద్‌ వర్మకు బుల్లెట్‌ గాయాలయ్యాయని ధృవీకరించారు. ఎమ్మెల్యేను వైద్యపరీక్షలకు పంపించామని, ఆయన ఫిర్యాదును స్వీకరించి తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఖేరిజిల్లా మేజిస్ట్రేట్‌ శైలేంద్రకుమార్‌సింగ్‌ ఎస్‌పి పూనమ్‌లు ఈప్రాంతాన్ని సందర్శించారు. తీవ్రంగా గాయపడిన బిజెపి ఎమ్మెల్యేను ఆసుప్రతిలో కూడా పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతియ వార్తల కోసం క్లిక్‌ చేయరడి :