మైనార్టీలపై బిజెపి ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం

somashekar reddy
somashekar reddy

బెంగళూరు: బిజెపి బళ్లారి ఎమ్మెల్యే సోమశేఖర రెడ్డి మైనార్టీలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం బళ్లారిలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన, ఆందోళనలు చేస్తున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో హిందువులు 80 శాతం మంది ఉన్నారు. మైనార్టీల కేవలం 17 శాతం మాత్రమే ఉన్నారు. హిందువులు తలచుకుంటే ఏమైనా చేయగలరు. వారితో చాలా జాగ్రత్తగా మెలగండి లేకపోతే అందరినీ కట్టగట్టి పాకిస్థాన్‌కు పంపుతామని అన్నారు. మేము కర్ణాటకలో అధికారంలోకి వచ్చి కేవలం ఐదు నెలలు మాత్రమే అవుతోందని డ్రామాలు చేయకుండా సైలెంట్‌ ఉండండి అంటూ మైనార్టీలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ దేశంలో నివసించాలి అనుకునే వారు ఇక్కడి ప్రభుత్వం చెప్పినట్టు వినాలని పేర్కొన్నారు. అలాగే ముస్లింలు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలని సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/