ఈ విషయం కెసిఆర్‌కు తెలిసే జరిగిందా?

MLA-Raja Singh
MLA-Raja Singh

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని భారీస్థాయిలో అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆలయ ప్రాకారంలోని మండప స్తంభాలపై సిఎం కెసిఆర్‌ ముఖచిత్రం చెక్కడం ఈ నేపథ్యంలో తెలంగాణ బిజెపినేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. యాదాద్రి ఆలయ గోడలు, స్తంభాలపై కెసిఆర్‌ బొమ్మ, కారు బొమ్మ, ఆయన తీసుకొచ్చిన పథకాలను చెక్కుతున్నారని రాజాసింగ్ విమర్శించారు. ఈ విషయం కెసిఆర్‌ కు తెలిసే జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఇలాంటి చర్యల ద్వారా కెసిఆర్‌ తనను తాను భగవంతుడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ స్తంభాలను వెంటనే తీసేయాలనీ, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వీటిని తొలగించకుంటే తెలంగాణ ప్రజలతో కలిసి తామే తొలగిస్తామని రాజాసింగ్ హెచ్చరించారు.

ఏంతో ప్రాశస్త్యం ఉన్న యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేయడం అన్నది ప్రభుత్వ బాధ్యత అనీ, ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు, పార్టీ జేబుల నుంచి డబ్బులు పెట్టడం లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ప్రజల సొమ్ముతో గుడి కడుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సరికావని హితవు పలికారు. ఈ విషయంలో కెసిఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/