కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ లపై సంచలన వ్యాఖ్యలు

raja singh
raja singh

హైదారబాద్‌: తెలంగాణ బిజెపిలో అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన నియోజవర్గంలో పర్యటిస్తే..కనీసం ప్రోటోకాల్‌ పాటించడం లేదని రాజాసింగ్‌ ఆరోపించారు. తనను రాష్ట్రా బిజెపి శాసనసభ నేతగా గుర్తించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బండారు దత్తాత్రేయ ఈ విషయంలో ప్రోటోకాల్‌ పాటించేవారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో నేను ఓడిపోవాలని కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ కోరుకున్నారని రాజాసింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్‌ రాకుండా చేసేందుకు కూడా ప్రయత్నించారని, కానీ అమిత్‌ షా జోక్యం చేసుకోవడంతో తనకు టికెట్‌ వచ్చిందని ఆయన చెప్పారు. తనకు హిందూ ధర్మ పరిరక్షణ, గో సంరక్షణే ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు రాజాసింగ్‌..తనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మార్గదర్శి అని వ్యాఖ్యానించారు. తనకు తెలంగాణ బిజెపి చీఫ్‌ పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని..బండి సంజ§్‌ు, ధర్మపురి అరవింద్‌, డీకే అరుణ ఈ పదవికి సరైనవారని రాజాసింగ్‌ తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/