అసెంబ్లీ నుండి ఈటెల రాజేందర్ సస్పెండ్

అసెంబ్లీ సమావేశాల నుండి బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సస్పెండ్ అయ్యారు. స్పీకర్ ఫై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన్ను స్పీకర్ సస్పెండ్ చేసారు. అసెంబ్లీ నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ చేస్తూ.. అసెంబ్లీ వ్యవహారాల చీఫ్ ప్రశాంత్‌ రెడ్డి.. తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. దాన్ని అసెంబ్లీ కూడా ఆమోదించింది.

దీంతో.. ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల నుంచి ఈటల రాజేందర్‌ ను సస్పెండ్‌ అయ్యారు. స్పీకర్‌ పోచారంపై ఈటల రాజేందర్‌ ఈ నెల 6వ తేదీన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు ఈటల రాజేందర్‌.. పోచారం శ్రీనివాస్‌ కు క్షమాపణలు చెప్పాలని.. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో.. డిమాండ్‌ చేసింది. దీనికి ఈటల రాజేందర్‌ ససేమీరా అనడంతో.. సస్పెండ్‌ చేశారు. గతంలో ఉద్దేశపూర్వకంగా సస్పెండ్‌ చేయించుకున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు. సభలో చర్చకంటే… బయట రచ్చకే వారు మెుగ్గు చూపుతున్నారని , ఈటల రాజేందర్‌ సభలో ఉండి చర్చ చేయాలని మేము కోరుకుంటున్నామని అన్నారు ప్రశాంత్‌ రెడ్డి. కానీ ఈటెల మాత్రం స్పీకర్ గారికి ఒక్క సారీ చెప్పలేకపోయారు ప్రశాంత్ రెడ్డి అన్నారు.