హోటల్‌లో మధ్యం సేవించి చిందేసిని బిజెపి ఎమ్మెల్యె

bjp
bjp

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ఖాన్‌పూర్‌ నియోజకవర్గానికి చెందిన బిజెపి ఎమ్యెల్యె కున్వర్‌ ప్రణవ్‌ సింగ్‌ డెహ్రాడూన్‌లోని ఓ హోటల్‌లో అనుచరులతో కలిసి మద్యం సేవించి చిందేశారు. అదీ చేతిలో నాలుగైదు తుపాకులను ప్రదర్శిస్తూ, అసభ్యపదజాలం వాడుతూ మరీ నృత్యం చేశారు. ఇటీవలే కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఆసుపత్రి నుంచి విడుదలైన సందర్భంగా అభిమానులతో కలిసి వేడుక చేసుకున్నారు. అయితే నేపథ్యంలో పార్టీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/