భోపాల్‌ నుంచి సాధ్వి ప్రగ్యా సింగ్‌ పోటీ?

Sadhvi Pragya Singh Thakur ,Digvijaya Singh
Sadhvi Pragya Singh Thakur ,Digvijaya Singh


భోపాల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మధ్యప్రదేశ్‌ మాజీ సియం దిగ్విజ§్‌ు సింగ్‌ పోటీ చేస్తున్న భోపాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సాధ్వి ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌ను బరిలోకి దించాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తుంది. విదిశ నుంచి రమాకాంత్‌ భార్గవ్‌, సాగర్‌ నుంచి రాజ్‌ బహదూర్‌ సింగ్‌, గుణ నుంచి కేపి యాదవ్‌ బిజెపి తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది.
దిగ్విజ§్‌ు సింగ్‌పై పోటీకి పార్టీ ఆదేశిస్తే తాను సిద్ధమేనని సాధ్వి ప్రగ్యా సింగ్‌ తెలిపారు. దిగ్విజ§్‌ు తనకు పోటీ కాదని ఆమె చెప్పారు. ఎందుచేతనంటే తను జాతీయవాదినని, కాంగ్రెస్‌ నేత ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారని ఆమె అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/