25 ఏళ్ల తర్వాత పనాజీలో బిజెపి ఓటమి

BJP
BJP

పనాజీ: సార్వత్రిక ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో దూసుకెళ్తున్న బిజెపికి గోవాలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మాత్రం షాక్‌ తగిలింది. గత రెండున్నర దశాబ్దాలుగా ప్రాతినిథ్యం వహిస్తున్న పనాజీలో కమలం పార్టీ నేడు ఓటమి చవిచూసింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో పనాజీ స్థానం నుంచి గెలుపొంది సియంగా బాధ్యతలు చేపట్టిన మనోహర్‌ పారికర్‌ ఈ ఏడాది మార్చిలో అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో పనాజీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికల్లో బిజెపి సిద్దార్ద్‌ కున్‌కోలియొంకర్‌ను బరిలోకి దింపింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో సిద్దార్ద్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి అటనాసియో మాన్సరేట్‌ 1700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/