ఆ పార్టీకి ఎక్క‌డా నూక‌లు చెల్ల‌వు : మ‌మ‌తా బెన‌ర్జీ

పురులియా: పురులియాలో జ‌రిగిన టీఎంసీ వ‌ర్క‌ర్ల స‌మావేశంలో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లడుతూ..కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ క‌ల్తీగా మారిపోయింద‌ని, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఆ పార్టీ దారుణంగా నాశ‌నం చేసిన‌ట్లు ఆరోపించారు. నోట్ల ర‌ద్దు లాంటి చ‌ర్య‌ల‌తో దేశాన్ని ధ్వంసం చేశార‌ని, ద‌ర్యాప్తు ఏజెన్సీల‌తో విప‌క్షాల‌ను టార్గెట్‌ చేస్తున్నార‌ని బీజేపీపై మ‌మ‌తా విమ‌ర్శ‌లు చేశారు.

ఇక దేశ‌వ్యాప్తంగా బీజేపీకి ఎక్క‌డా నూక‌లు చెల్ల‌వ‌ని ఆమె ఆరోపించారు. నోట్ల ర‌ద్దు అనేది ఓ పెద్ద స్కామ్ అని దీదీ విమ‌ర్శించారు. కేంద్రంలోని ప్ర‌జావ్య‌తిరేక ప్ర‌భుత్వంతో దేశ ప్ర‌జ‌లు విసుగెత్తిపోయార‌ని ఆమె అన్నారు. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీకి ఎంట్రీ ఉండ‌ద‌ని ఆమె తెలిపారు. ఆ పార్టీ వెళ్లిపోవాల‌ని, మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు లేవ‌ని ఆమె అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/